సైకత శిల్పంతో ఆకట్టుకున్న దేవిన శ్రీనివాస్ కుమార్తెలు - అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం న్యూస్
రేపు జరిగే అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా రంగంపేటలో సైకత శిల్పి దేవిన శ్రీనివాస్ కుమార్తెలు.. సైకత శిల్పాన్ని రూపొందించారు. ఇది వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
![సైకత శిల్పంతో ఆకట్టుకున్న దేవిన శ్రీనివాస్ కుమార్తెలు International Mother Language Day sculpture at Rangampet, East Godavari District](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10708512-486-10708512-1613836322708.jpg)
సైకత శిల్పాన్ని రూపొందించిన దేవిన శ్రీనివాస్ కుమార్తెలు
అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకొని తూర్పు గోదావరి జిల్లా రంగంపేటలో సైకత శిల్పి దేవిన శ్రీనివాస్ కుమార్తెలు.. సైకత శిల్పాన్ని రూపొందించారు. 'తెలుగు భాషను బతికిద్దాం.. దేశ భాష లందు తెలుగు లెస్స' అనే నినాదాలతో 'అ' అక్షరానికి రక్షణ కల్పించినట్టుగా తీర్చిదిద్దారు. అందుకోసం 4 గంటలు శ్రమించినట్లు దేవిన సిస్టర్స్ పేర్కొన్నారు. ఇది ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది.