కృష్టాష్టమి పురస్కరించుకుని భారత్ టాలెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్రేయపురం మండలం మ్యాజిక్ హౌస్లో అంతర్జాలంలో చిన్నారులకు అంతర్జాతీయ స్థాయిలో బాలకృష్ణుడు అవార్డు పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు కృష్ణుడి వేషధారణలో కరోనాపై ముద్దు ముద్దు మాటలతో ప్రదర్శనలు ఇచ్చారు. వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగువారు, భారత దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 358 మంది చిన్నారులను కృష్ణుడు, గోపికల వేషధారణతో ఈ పోటీల్లో పాల్గొన్నారు. కరోనా వైరస్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చిన్నారులు అవగాహన కల్పిస్తూ ప్రదర్శన చేశారు. ఈ పోటీలో 32 మందిని జూనియర్స్, సీనియర్స్ విభాగాలలో ఎంపిక చేసి వారిని ఫైనల్లో జూమ్ యాప్ ద్వారా పోటీలను నిర్వహించారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు కె. అన్నపూర్ణ ద్వారా ఆన్ లైన్ లో వారికి అవార్డులు పంపించడం జరిగిందని నిర్వాహకుడు మోహిత్ తెలిపారు.
అంతర్జాలంలో చిన్నారులకు బాలకృష్ణుడు అవార్డు పోటీలు - Internet competitions for children in Atreyapuram
కృష్ణాష్టమి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలో భారత్ టాలెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాలంలో చిన్నారులకు పోటీలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో చిన్నారులు కరోనాపై పలు ప్రదర్శనలు ఇచ్చారు. గెలిచిన చిన్నారులకు బహుమతులను పంపిస్తామని నిర్వాహుకుడు మోహిత్ తెలిపారు.
అంతర్జాలంలో చిన్నారులకు అంతర్జాతీయ స్థాయిలో బాలకృష్ణుడు అవార్డు పోటీలు
ఇవీ చదవండి