Inter Student Excel in Karate:ఆ గోదారమ్మాయి పంచ్ కొడితే ప్రత్యర్థి సంగతి అంతే. నాన్ చాక్ తిప్పడమైనా.. కర్రసామైనా.. కరాటే, కుంగ్‌ఫూ అయినా.. ఆ యువతి రంగంలోకి దిగనంత వరకే. తాను దిగిందా.. కచ్చితంగా పతకం తన ఖాతాలో చేరాల్సిందే. అలా సాగుతోందామె ప్రయాణం. కరాటేలోనే కాకుండా అటు చదువులోనూ రాణిస్తూ దూసుకెళ్తోందీ ఫైటర్. పంచ్ పవర్ చూపిస్తున్న ఈ యువతి పేరు శ్రీలక్ష్మీలత. రాజమహేంద్రవరం మల్లయ్యపేట సమీపంలోని వాంబే గృహాల్లో ఉండే నెల్లి అప్పారావు, సుజాత గాయత్రిల కుమార్తె.
Rajamahendravaram Young Girl Excelling in Karate:యువతి తండ్రి ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఓ కోళ్ల పెంపకం సంస్థలో చిరుద్యోగి. తల్లి గృహిణి. చిన్నప్పటి నుంచి శ్రీలక్ష్మీలత చదువుల్లో చురుగ్గా ఉండేది. చదువుతో పాటు కరాటే నేర్పించాలనుకున్నాడు తండ్రి. ఆ క్రమంలోనే తనకు కలిగిన ఆసక్తి గురించి చెబుతోంది. ఇంటర్ చదువుతున్న శ్రీలక్ష్మీలత అటు కరాటేలోనే కాక చదువుల్లోనూ రాణిస్తోంది. పదిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. తాను రింగ్‌లోకి దిగిన ప్రతీసారి పతకం పట్టుకెళ్తోంది. అందుకు తన కుటుంబ ప్రోత్సాహమే కారణమంటోంది ఈ కరాటే ఫైటర్.
తండ్రి కళ్లలో ఆనందం కోసం.. సరికొత్త యంత్రాన్ని ఆవిష్కరించాడో కుమారుడు
"ఆత్మరక్షణ కోసం నేర్చుకున్న కరాటే ఇప్పుడు నాకు మంచి గుర్తింపు తెచ్చిపెడుతోంది. అక్టోబర్‌లో తిరువనంతపురంలో జరిగే కరాటే అసోసియేషన్ పోటీల కోసం సిద్ధమవుతున్నాను. ఇందులో గెలిస్తే ఆసియా గేమ్స్‌లో పాల్గొనేందుకు నాకు అర్హత లభిస్తుంది. ఆసియా గేమ్స్, ఒలింపిక్స్‌లో పాల్గొనటం నా లక్ష్యం. కరాటేతో పాటు చదువుల్లోనూ రాణించి ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను." - శ్రీలక్ష్మీలత, కరాటే క్రీడాకారిణి