రాష్ట్రంలో ముగ్గురు పోలీస్ ఉన్నతాధికారులను బదిలీ చేయడం ఎన్నికల సంఘం తొందరపాటు చర్య అని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక నేరాల్లో నిందితుడుగా ఉన్న వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై... ఎటువంటి వివరణ, నివేదిక కోరకుండా 24 గంటల్లోపు చర్యలు తీసుకున్నారని తూర్పుగోదావరి జిల్లా తునిలో ఆక్షేపించారు. ఎన్నికల షెడ్యుల్ విడుదలకు ముందు అధికారుల జాబితాను ఈసీ తీసుకుంటుందని చెప్పారు. అందులో ఉన్న అధికారులను మాత్రమే.. ఎన్నికల సమయంలో బదిలీ చేసే అధికారం ఈసీకి ఉంటుందన్నారు. లేని అధికారాన్ని తీసుకుని ఇంటిలిజెన్స్ డీజీని బదిలిచేయడం దారుణమని చెప్పారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో నిజాలు బయటకు వస్తాయని భయంతో వైకాపా నేతలు ఫిర్యాదు చేస్తే... ఎలాంటి నివేదిక కోరకుండా కడప ఎస్పీని బదిలిచేయడం ఏమిటని ప్రశ్నించారు. అదేవిధంగా నివేదిక లేకుండా శ్రీకాకుళం ఎస్పీని కూడా బదిలీ చేశారన్నారు. ఈ విషయంపై ఎంతవరకైనా వెళ్తామని చెప్పారు.ఇవి కూడా చదవండి:
ప్రచార జోరు పెంచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు...