ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు నిఘా వర్గాల హెచ్చరిక..

INTELLIGENCE ALERT : ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులకు ఇంటెలిజెన్స్ హెచ్చరిక జారీ చేసింది. కొందరు మంత్రులు, ప్రజాప్రతినిధులపై దాడులు జరగవచ్చని నిఘా విభాగం తెలిపింది.

INTELLIGENCE ALERT
INTELLIGENCE ALERT

By

Published : Oct 23, 2022, 8:40 AM IST

INTELLIGENCE ALERT TO YSRCP LEADERS : రాష్ట్రంలో కొందరు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేసింది. తూర్పు గోదావరి, ఉత్తారాంధ్ర జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. టెక్కలి జనసేన కార్యాలయంపై దాడి ఘటనకు ప్రతీకార దాడి జరగొచ్చని ఈ హెచ్చరికల్లో ఇంటెలిజెన్స్‌ పేర్కొంది. అధికార పార్టీ నేతలపై దాడులకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో బెదిరింపు ప్రకటనలను చూసిన ఇంటెలిజెన్స్‌ విభాగం ఈ మేరకు అప్రమత్తమైంది.

ఇదీ జరిగింది : Attack On Janasena Party Office: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జనసేన పార్టీ కార్యాలయంపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. ఒక్కసారిగా 30 మంది వైకాపా కార్యకర్తలు.. కార్యాలయంలోకి దూసుకొచ్చి వీరంగం సృష్టించారు. కార్యాలయంలో కుర్చీలు, బల్లలు విరగొట్టారు. ఫర్నిచర్​ను కర్రలతో కొడుతూ ధ్వంసం చేయడంతో.. చెల్లాచెదురుగా పడిపోయాయి. విషయం తెలుసుకున్న జనసేన కార్యకర్తలు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. వైకాపా కార్యకర్తలు విధ్వంసానికి పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన కార్యాలయంపై దాడి అప్రజాస్వామికమని.. నాదెండ్ల మనోహర్‌ ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ దువ్వాడ అనుచరులే దాడికి పాల్పడినట్టు అనుమానం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని నాదెండ్ల డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details