పంచాయతీ ఎన్నికల సమరం ప్రారంభం కావటంతో అభ్యర్ధులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఓట్ల కోసం కొత్త కొత్త అవతారాలు ఎత్తుతూ ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
పంచాయతీ ఎన్నికల్లో వినూత్న ప్రచారాలు - తూర్పు గోదావరి జిల్లాలో వినూత్నంగా పంచాయితీ ఎన్నికల్లో ప్రచారాలు తాజా వార్తలు
పంచాయతీ పోరులో నిలిచి గెలవాలంటే అంత సులువేం కాదు. ఒక్కోసారి ఒక్క ఓటుతోనే ఫలితం తలకిందులు కావచ్చు. అందుకే గ్రామాల సంగ్రామంలో గెలిచేందుకు స్థానిక నేతలు ఎంతని అవతారం ఉండదు అంటే అతిశయోక్తి కాదు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఇద్దరు మహిళలు చేసే ప్రచారం చూస్తే ఓటు కోసం కోటి తిప్పలు అనక మానం.
నామినేషన్ వేసిన రోజు నుంచే అభ్యర్థులు గ్రామాల్లో తిరుగుతూ ప్రచారాలు ప్రారంభించారు. ఎన్నికల గుర్తు రాకుండానే గ్రామాల్లో పర్యటించి.. ఓటర్లు దగ్గరకు వెళ్లి తమకే ఓటు వేయాలని వేడుకుంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా మండల కేంద్రమైన కొత్తపల్లిలో ఇద్దరు మహిళలు పోటా పోటీగా తమదైన శైలిలో వినూత్నంగా ప్రచారం చేస్తూ ఆకర్షిస్తున్నారు. ఒకరు ఇంటి పనుల్లో భాగస్వాములు అయితే మరొకరు రోడ్లు ఊడుస్తూ.. పప్పు రుబ్బుతూ ఇలా పోటాపోటీగా ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు.
ఇవీ చూడండి...:అదనపు సామర్ధ్యాలతో బియ్యం ఎగుమతి చేసేందుకు అనుమతి