ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలవరం పునరావాస కాలనీలలో మౌలిక వసతులు కరవు - జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు

పోలవరం నిర్వాసితులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కాలనీలను జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు అనంత నాయక్ సందర్శించారు. కాగా నిర్వాసిత గృహాల్లో కనీస వసతులు లేవని స్థానికులు ఆయన ముందు వాపోయారు.

జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు అనంత నాయక్
జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు అనంత నాయక్

By

Published : Aug 26, 2021, 3:17 PM IST

పోలవరం నిర్వాసితులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కాలనీలలో మౌలిక సదుపాయాలు లేవని తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలానికి చెందిన నిర్వాసితులు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు అనంత నాయక్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు.

బుధవారం ఆయా ప్రాంతాలను అనంత నాయక్ సందర్శించి నిర్వాసితుల గృహాలను పరిశీలించారు. తమకు నిర్మించిన గృహాలు నాసిరకంగా ఉన్నాయని, తాగేందుకు నీరు లేదని, రహదారులు వేయలేదని, రాత్రి వేళల్లో విద్యుత్ దీపాలు లేక అంధకారంలో ఉంటున్నామని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు.

జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు అనంత నాయక్ కు వినతిపత్రం ఇస్తున్న పోలవరం నిర్వాసిత కాలనీ ప్రజలు

వర్షం వస్తే స్లాబ్ ల పైనుంచి నీరు లీక్ అవుతోందని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లించలేదని, అధికారుల చుట్టూ తిరుగుతున్న నేటికీ న్యాయం జరగలేదని నిర్వాసితులు వాపోయారు. డి పట్టా భూములకు పరిహారం చెల్లించాలని కోరారు.

మెట్ట వీధి కాలనీలో నీటికి గృహ నిర్మాణాలు పూర్తి చేయలేదన్నారు. ఈ సందర్భంగా భీంపల్లి కాలనీలో గ్రామసభ నిర్వహించి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు అనంత నాయక్ మాట్లాడుతూ.. గుర్తించిన సమస్యలను కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని అన్నారు. ఈ పర్యటనలో కమిషన్ అసిస్టెంట్ డైరెక్టర్ అశోక్ వర్ధన్, సీనియర్ లీగల్ కన్సల్టెంట్ రాధాకృష్ణ త్రిపాటి, రీజినల్ మెంబర్ బిశ్వాల్, ఐటీడీఏ పీవో ప్రవీణ్ ఆదిత్య , పోలవరం అడ్మినిస్ట్రేటర్ ఆనంద్, సబ్ కలెక్టర్ సింహాచలం తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:Fake challans: నకిలీ ఈ చలానాల కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details