గువహటిలో అనారోగ్యంతో మృతి చెందిన భారత జవాను రాసబోయిన వెంకన్న మృతదేహం... ఈ రోజు మధ్యాహ్నం స్వగ్రామానికి చేరుకుంది. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చిన్నజగ్గంపేటలో వెంకన్న అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామస్థులు, సమీప గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో హాజరై తుది వీడ్కోలు పలికారు. సైనిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు ముగిశాయి.
ముగిసిన జవాను అంత్యక్రియలు... సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు - తూర్పుగోదావరి జిల్లా నేటి వార్తలు
సైనికుడిగా విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మృతి చెందిన తూర్పుగోదావరి జిల్లా చిన్నజగ్గంపేట వాసి వెంకన్న అంత్యక్రియలు... ఆయన స్వగ్రామంలో సైనిక లాంఛనాల మధ్య ముగిశాయి.
తూర్పుగోదావరి జిల్లా చిన్నంజగ్గంపేటలో సైనికుడి అంత్యక్రియలు