తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగమైన కేంద్రపాలిత యానంలో స్వాతంత్ర దినోత్సవం నిరాడంబరంగా జరిగాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు నిబంధనలు పాటిస్తూ వేడుకలు నిర్వహించారు. పుదుచ్చేరి ఆర్థిక శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. శాంతికి చిహ్నమైన పావురాలను... మువ్వన్నెల బెలూన్లను గాలిలోకి వదిలారు. ఈ కార్యక్రమంలో యానం డిప్యూటీ కలెక్టర్ శివరాజ్ మీనా జిల్లా ఎస్పీ భక్తవత్సలం, మున్సిపల్ కమిషనర్ గౌరీ సరోజా, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
యానాంలో నిరాడంబరంగా స్వాతంత్య్ర వేడుకలు - independence day celebration
యానాంలో 74వ స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహించారు. పుదుచ్చేరి ఆర్థిక శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

independence day celebration in yanam