ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మళ్లీ గోదావరి ఉగ్రరూపం... లంక గ్రామాలు గజగజ... - incrsing flood at godavari

కనకాయలంక, చాకలిపాలెం సమీపంలోని కజ్వే నాలుగోసారి ముంపునకు గురైంది. గోదావరి పరిసర ప్రాంత ప్రజలకు ఇదే పరిస్థితి..దీంతో అక్కడి ప్రజల అవస్థలు అన్నీఇన్నీకావు.

మళ్లీ పెరుగుతున్న గోదావరి వరద ఉద్ధృతి...

By

Published : Sep 7, 2019, 5:15 AM IST

మళ్లీ పెరుగుతున్న గోదావరి వరద ఉద్ధృతి...

మళ్లీ గోదావరి వరద పెరగడంతో తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో గ్రామాల ప్రజలు కలవరపడుతున్నారు. పి. గన్నవరం నియోజకవర్గం చాకలి పాలెం సమీపంలో కాజ్వే నిన్న సాయంత్రం నుంచి మళ్లీ ముంపు బారిన పడింది. ఈ కారణంగా పశ్చిమ గోదావరి జిల్లా కనకాయలంక గ్రామ ప్రజలకు అవస్థలు మాత్రం తప్పటం లేదు. ఆగస్టు నుంచి ఇంతవరకు వచ్చిన వరదల కారణంగా కాజ్వే ముంపునకు గురి కావడం నాలుగోసారి. కోనసీమలో వరదనీటి ప్రభావంతో నది పాయలు పోటెత్తి ప్రవహిస్తున్నాయి. దీంతో విద్యార్థులకు, మహిళలకు, వృద్ధులకు వాగులు దాటటం కష్టంగా మారుతోంది.
గోదావరిలోనూ వరద ఉద్ధృతంగా మారింది. గోదావరి ఉపనది ఇంద్రావతి పరివాహక ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురవటంతో ఈ నెల 10 నాటికి వరద ప్రవాహం పెరుగుతుందని జలవనరులశాఖ అంచనా వేస్తోంది. రాజమహేంద్రవరం వద్ద 10 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం చేరుతుందంటున్నారు అధికారులు. దేవీపట్నం మండలంలో రహదారులపైకి వరద చేరటంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అక్కడి స్థానికులు.

మహారాష్ట్రలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదిలోకి చేరుతున్న వరద నీరు ధవళేశ్వరం ఆనకట్ట వద్ద అంతకంతకు ఎక్కువ కావడంతో 10 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. దీని ప్రభావంతో తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం పరిధిలోని పల్లం వారి పాలెం వివేకానంద వారధి వద్ద, మురుమళ్ళ రాఘవేంద్ర వారధి వద్ద, అన్నంపల్లి ఆక్టి డేట్ ఎదుర్లంక బాలయోగి వారధి వద్ద నుండి వరద నీటిరు సముద్రంలోకి సుడులు తిరుగుతూ పోతుంది. మళ్లీ వరద రావటంతో లంక గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చూడండి:వీడియో: మహిళ ఆత్మహత్యాయత్నం..రక్షించిన యువకులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details