ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రిజర్వేషన్ల కోసం మాదిగల డిమాండ్

మాదిగ జాతి అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలంటూ రాజమండ్రిలో మాదిగ రాష్ట్ర సమితి నేతలు డిమాండ్​ చేశారు.

తమ డిమాండ్​లు చెపుతున్న ఆకుమూర్తి చిన్న మాదిగ

By

Published : Jul 29, 2019, 7:55 AM IST

రిజర్వేషన్ల కోసం మాదిగల డిమాండ్

పాదయాత్ర సమయంలో జగన్​మోహన్​ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాదిగ రాష్ట్ర సమితి నేతలు కోరారు. రాజమండ్రిలో మాదిగల సమావేశం నిర్వహింఛారు.ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీ, పార్లమెంట్​లో మాట్లాడాలని ఆంధ్రప్రదేశ్ మాదిగ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఆకుమూర్తి చిన్న మాదిగ అన్నారు. తమ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వము నెరవేర్చాలని తెలిపారు. మాదిగ కార్పొరేషన్​ను వెంటనే ఏర్పాటు చేయాలని, నామినేటెడ్ పోస్టులు, నామినేషన్​ పనుల్లో మాదిగలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details