తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగిన డీఆర్సీ సమావేశం రసాభాసగా మారింది. టిడ్కో ఇళ్ల కేటాయింపులో అవినీతి జరిగిందని వైకాపా ఎంపీ సుభాష్ చంద్రబోస్ ఆరోపించారు. ఎంపీ వ్యాఖ్యలను కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఖండించారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తెదేపా హయాంలోనే అవినీతి జరిగిందని ఎమ్మెల్యే ద్వారంపూడి ఆరోపించారు.
డీఆర్సీ సమావేశంలో రసాభాస... వైకాపా ఎంపీ, ఎమ్మెల్యే వాగ్వాదం - కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి కామెంట్స్
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ డీఆర్సీ సమావేశం రసాభాసగా ముగిసింది. వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్, ఎంపీ సుభాష్ చంద్రబోస్ మధ్య మాటల యుద్ధం జరిగింది. టిడ్కో ఇళ్ల కేటాయింపుల్లో అవినీతి జరిగిందని ఎంపీ బోస్ ఆరోపించారు. ఎవరు అవినీతి చేశారో వారి పేర్లు తనకు తెలపాలని ద్వారంపూడి డిమాండ్ చేశారు. తెదేపా హయాంలోనే అవినీతి జరిగిందని ఆరోపించిన ద్వారంపూడి వ్యాఖ్యలపై తెదేపా ఎమ్మెల్యేలు అభ్యంతరం తెలిపారు.
ద్వారంపూడి ఆరోపణలపై తెదేపా ఎమ్మెల్యేలు జోగేశ్వరరావు, చినరాజప్ప అభ్యంతరం తెలిపారు. ఎమ్మెల్యేకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించిన జోగేశ్వరరావును ద్వారంపూడి పక్కకు తోసేశారు. మేడలైను వంతెన నిర్మాణాన్ని తక్షణం ఆపేయాలని ఎంపీ సుభాష్ చంద్రబోస్ కోరారు. ఈ నిర్మాణాల వల్ల కాకినాడ నగరం, గ్రామీణప్రాంతం ముంపుబారిన పడుతుందని ఎంపీ బోస్ అన్నారు. ఈ విషయాలపై ఎమ్మెల్యే ద్వారంపూడి, ఎంపీ బోస్ మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం చోటువచేసుకుంది. నేతల వాగ్వాదంతో డీఆర్సీ సమావేశాన్ని కలెక్టర్ అర్ధాంతరంగా నిలిపివేశారు.
ఇదీ చదవండి :బంగాళాఖాతంలో స్థిరంగా వాయుగుండం...రేపటి నుంచి వర్షాలు పడే అవకాశం