TDP leaders protested by sitting on their knees: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి కెనాల్ రోడ్డుపై టీడీపీ శ్రేణులు మోకాళ్లపై కూర్చొని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. రహదారి దుస్థితిపై చేసిన నిరసన కార్యక్రమంలో అనపర్తి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాద్యకుడు నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ఇదేం ఖర్మ కెనాల్ రహదారికి అనే నినాదంతో రహదారిపై మోకాళ్లపై బైఠాయించారు. వెంటనే రహదారి నిర్మించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని రహదారుల దుస్థితిపై టీడీపీ నిరసన.. - అనపర్తి కెనాల్ తూ గోదావరిలో టీడీపీ నాయకులు నిరసన
TDP leaders protested by sitting on their knees : రాష్ట్రంలోని రహదారుల దుస్థితిపై తూర్పుగోదావరి జిల్లా అనపర్తి కెనాల్ రోడ్డుపై టీడీపీ శ్రేణులు వినూత్నంగా నిరసన తెలిపారు. మోకాళ్పై కూర్చుని ఆందోళన చేపట్టారు. అనపర్తి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యకుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ఇదేం ఖర్మ కెనాల్ రహదారికి అనే నినాదంతో రహదారికి ఇరువైపులా ఫ్లెక్సీలు పట్టుకొని నిరసనలో పాల్గొన్నారు. రహదారిపై మోకాళ్లపై బైఠాయించారు. వెంటనే రహదారి నిర్మించాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసనలో భాగంగా మాజీ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో రోడ్లు పూర్తిస్థాయిలో శిథిలమై, వాహనాలు వెళ్లే పరిస్థితి లేక అనేక ప్రమాదాలు జరుగుతున్నా ఎమ్మెల్యే చోద్యం చూస్తున్నారన్నారు. కనీసం రోడ్ల గుంతలు కూడా పూడ్చలేని జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులను ఏ విధంగా నిర్మిస్తారన్నారు. ప్రతిపక్షంలో ఉండగా రోడ్ల దుస్థితి పై పాదయాత్రలు చేసిన ప్రస్తుత ఎమ్మెల్యే ఇప్పుడేమీ చేస్తున్నారని ప్రశ్నించారు. అర కొరగా గుంతలు పూడ్చినా.. నాణ్యత లోపాలతో రెండు నెలల కాలం కూడా గడవకుండానే తిరిగి రోడ్లపై గుంతలు ఏర్పడుతున్నాయని విమర్శించారు.
ఇవీ చదవండి: