గోకవరం మండలం కృష్ణునిపాలెంలో అమ్మవారి జాతర నిర్వహించారు. ఈ జాతరలో భాగంగా పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం ప్రకారం అమ్మవారిని కొత్తూరులో ఆలయం వద్ద నుంచి పుట్టినిల్లు అయిన కృష్ణునిపాలెం తీసుకువచ్చి ఉత్సవాలు నిర్వహించారు. అమ్మవారు రావడంతో ఆడపడుచులు గ్రామానికి వచ్చి దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారిని తిరిగి ఆలయం వద్దకు సాగనంపారు. ముందురోజు రాత్రి గరగలు, తిన్మార్ డప్పులతో అమ్మవారిని గ్రామంలో ఊరేగించారు. బుధవారం ఉదయం అమ్మవారి పాక వద్ద పూజలు నిర్వహించి బయటకు తీసుకువచ్చారు. అనంతరం పాకకు నిప్పు అంటించి దగ్ధం చేశారు. అనంతరం నిర్వహించిన అన్నదానంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గున్నారు.
కృష్ణునిపాలెంలో ఘనంగా గ్రామదేవత జాతర - గోకవరం మండలం
తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కృష్ణునిపాలెంలో గ్రామదేవత గుబ్బాలమ్మ అమ్మవారి జాతర ఘనంగా నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి పూజలు చేశారు.
అమ్మవారికి జాతర నిర్వహిస్తున్న గ్రామస్థులు