చామ దుంపలు సాధారణంగా రెండు, మూడు అంగుళాల పొడవు, 50 గ్రాముల బరువు వరకు ఉంటాయి. సాధారణ పరిమాణం కంటే అధికంగా..శంఖు ఆకారంలో కనిపిస్తున్న ఈ చామ దుంప యానాంలో కొనుగోలుదారులను ఆకట్టుకుంటోంది. స్థానిక జీహెచ్ రోడ్డులో కాయగూరల దుకాణం నిర్వహించే కోన సత్తిబాబు కాకినాడ హోల్ సేల్ మార్కెట్ నుంచి తీసుకొచ్చిన కూరగాయలలో పెద్ద చామదుపం ఉండడంతో దీనిని ప్రత్యేక ఆకర్షణగా ప్రదర్శిస్తున్నారు. 665 గ్రాముల బరువు,11 అంగుళాల పొడవున చామదుంప ఎదగడం అసాధారణమని, అందుకే ఎవరికీ అమ్మకుండా ఉంచానని సత్తిబాబు తెలిపారు.
చామ దుంప.. ఎంత పెద్దదో..!! - chemadumpa news
యానాంలోని ఓ ఇంట్లో 665 గ్రాముల బరువు, 11 అంగుళాల పొడవైన చామదుంప.. ఆకట్టుకుంటోంది.
యానాంలో ఆకట్టుకుంటున్న చామదుంప