తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ఆంపన్ తీవ్ర ప్రభావం చూపుతోంది. రైతన్నలు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించగా... ఇప్పుడు ఆంపన్ తుపాను ముంచుకొచ్చింది. కొనుగోలు కేంద్రం గట్లపై ఉన్న ధాన్యాన్ని తడుస్తాయేమోనని భయంతో రైతులు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. కొనుగోలు కేంద్రంలో ఇప్పటివరకు ఒక్క బస్తా కూడా కొనట్లేదని... రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిల్లర్లకు తక్కువ రేటుకు ధాన్యాన్ని అమ్ముతున్నారు.
'అన్నదాతలపై అంపన్ ప్రభావం' - ముమ్మిడివరంలో ధాన్యం వార్తలు
అంపన్ పెను తుపానుగా మారడంతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని పలుమండలాల్లో ధాన్యం బస్తాలను కొనుగోలు కేంద్రాల నుంచి రైస్‌మిల్లులకు తరలించారు. ఇప్పటివరకు మార్కెట్ యార్డులో ఒక్క బస్తా కూడా కొనుగోలుచేయలేదని రైతులు వాపోయారు.
ముమ్మిడివరంలో అంపన్ తుపాను