తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో 70 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం అల్పాహారం తిన్న విద్యార్థినులు పాఠశాలకు వెళ్లారు. కొద్దిసేపటికే కడుపునొప్పి రావడం, పలువురికి విరేచనాలు అవడంతో వసతిగృహానికి తరలించి.. పెదగెద్దాడ పీహెచ్‌సీ డాక్టర్ నరేష్ ఆధ్వర్యంలో వైద్యసేవలందించారు. ప్రస్తుతం అందరూ కోలుకున్నారు. కాకినాడ ఫుడ్‌ఇన్‌స్పెక్టర్ వచ్చి ఆహార పదార్థాల నమూనాలు సేకరించారు. వైద్యుడు మాట్లాడుతూ... కలుషితనీరు, ఆహారం కారణం కావొచ్చన్నారు. పిల్లల ఆరోగ్యం నిలకడగా ఉందనీ.. వైద్యశిబిరం ఏర్పాటు చేశామని డీడీ సరస్వతి తెలిపారు.
70 మంది విద్యార్థినులకు అస్వస్థత
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో డెభ్బై మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వారందరి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
విద్యార్థినులకు అస్వస్థత