తూర్పు గోదావరి జిల్లా వై.రామవరం మండలం డొంకరాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని తనిఖీ కేంద్రం వద్ద అక్రమంగా తరలిస్తున్న 600 కిలోల గంజాయి పట్టుబడింది. బుధవారం సాయంత్రం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక కంటైనర్లో రూ.18 లక్షల విలువైన గంజాయిని పోలీసులు గుర్తించారు.
అక్రమంగా తరలిస్తున్న 600 కిలోల గంజాయి పట్టివేత.. ఒకరి అరెస్ట్ - east Godavari district news
తూర్పు గోదావరి జిల్లా డొంకరాయి పోలీసుస్టేషన్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. గంజాయి తరలిస్తున్న వాహనంతో పాటు ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అక్రమంగా తరలిస్తున్న 600 కిలోల గంజాయి పట్టివేత.. ఒకరి అరెస్ట్
విశాఖ జిల్లా దారకొండ నుంచి తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డికి గంజాయిని తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసి.. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు.
ఇదీ చదవండి:కిలిమంజారో అధిరోహకుడికి పవన్ అభినందనలు