ఒడిశా నుంచి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం తీసుకొచ్చి విక్రయిస్తున్న అక్రమ మద్యం సీసాలను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. పిఠాపురం ఎక్సైజ్ సీఐ కాత్యాయని తెలిపిన వివరాల ప్రకారం.. పిఠాపురానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు నాలుగు రోజులుగా ప్రత్యేక నిఘా పెట్టారు. నిందితుల్లో ఓ వ్యక్తి పిఠాపురంలోని క్రాంతి ట్రాన్స్పోర్టు నడుపుతున్న క్రమంలో.. ఒడిశా నుంచి మద్యం రాష్ట్రానికి తీసుకురావడానికి ట్రాన్స్‌పోర్ట్ మార్గాన్ని ఎంచుకున్నట్లు సీఐ తెలిపారు. పోలీసుల తనిఖీల్లో ఓ కారులో మద్యం సీసాలను తరలిస్తుండగా.. పట్టుకున్నట్లు వివరించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఒడిశా నుంచి రాష్ట్రానికి అక్రమంగా మద్యం రవాణా - పిఠాపురం వార్తలు తాజా
రాష్ట్రంలో..ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా ఎక్కువవుతోంది. ఏపీ సరిహద్దు రాష్ట్రాల్లోని మద్యంను అనేక మార్గాల ద్వారా రాష్ట్రానికి తరలిస్తున్నారు. తాజాగా ఒడిశా నుంచి పిఠాపురానికి అక్రమంగా రవాణా చేస్తున్న మద్యంను పోలీసులు గుర్తించారు.
illegal wine transporter