తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా... బొలెరో వాహనంలో తరలిస్తున్న 435 తాబేళ్లను పట్టుకున్నారు. జిల్లాలోని రావులపాలెం నుంచి ఒడిశాకు తరలిస్తున్నట్టు అటవీశాఖ అధికారి దుర్గాకుమార్ తెలిపారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వన్యప్రాణి పరిరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లు పట్టివేత - తూర్పుగోదావరి జిల్లా నేర వార్తలు
ఒడిశాకు అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని, వన్యప్రాణి పరిరక్షణ చట్టం క్రింద కేసు నమోదు చేశారు.
అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లు పట్టివేత