Illegal Sand Mining Mafia in AP: రాష్ట్రంలో ఇసుకాసురుల ఆగడాలు ఆగడంలేదు. అధికార పార్టీ అండదండలతో భారీ యంత్రాలతో విచ్చలవిడిగా తవ్వకాలు జరిపి రేయింబవళ్లూ తేడా లేకుండా వందల లారీల్లో ఇసుక తరలిస్తున్నారు. అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది.
డ్రెడ్జింగ్ యంత్రాలతో జల వనరులను తోడేస్తున్న దోపిడీదారులు - వైసీపీ పెద్దల అండతోనే దోపిడీ
Sand Mining in East Godavari District: గోదావరిలో భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరపకూడదని జాతీయ హరిత ట్రైబున్యల్ స్పష్టంగా చెప్పినా ఎక్కడా అమలుకావటం లేదు. పైగా రాష్ట్రంలో ఎక్కడా ఇసుక తవ్వకాలు జరపడం లేదని న్యాయస్థానానికి అడ్వొకేట్ జనరల్ కూడా తెలిపారు. అయినా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం ఇసుక దందా ఆగడం లేదు. అధికార పార్టీ అండదండలతో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. గోదావరి గర్భంలో భారీ యంత్రాలతో తవ్వకాలు చేస్తూ రేయింబవళ్లు వందల లారీల్లో ఇసుక తరలిస్తున్నారు.
Illegal Sand Mining Mafia in Konaseema District: కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఊబలంకలో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్చగా జరుగుతున్నాయి. ఊబలంక రేవులో ఈ నెల 1వ తేదీ నుంచి ఆరు భారీ యంత్రాలతో తమిళనాడు ప్రాంతానికి చెందిన వ్యక్తుల పర్యవేక్షణలో తవ్వకాలు జరుగుతున్నాయి. రోజుకు సుమారు 300 వరకు లారీలపై ఇసుకను ఉభయ గోదావరి జిల్లాలతో పాటు, విశాఖపట్నం వైపు తరలిస్తున్నారు. రోజుకు 30 లక్షల రూపాయల మేర లావాదేవీలు జరుగుతున్నాయని అంచనా.