ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమంగా బియ్యం తరలిస్తున్న లారీ సీజ్.. ముగ్గురిపై కేసు నమోదు - అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్న వారు అరెస్ట్

అక్రమంగా తరలిస్తున్న 400 బస్తాల బియ్యాన్ని తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం పెద్దపళ్లలో విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు పట్టుకున్నారు. డ్రైవర్​తో పాటు, బియ్యం తరలింపునకు సహకరించిన వ్యక్తులు నాని, ప్రసాద్​లపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

illegal ration rice transportation lorry seized
అక్రమంగా బియ్యం తరలిస్తున్న లారీ సీజ్

By

Published : Feb 17, 2021, 9:52 PM IST

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం పెద్దపళ్లలో అక్రమంగా తరలిస్తున్న బియ్యం లారీని విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు సీజ్ చేశారు. అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో... విజిలెన్స్ సీఐ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. పెద్దపళ్ల గ్రామంలో 400 బస్తాల బియ్యాన్ని తరలిస్తున్న లారీని పట్టుకున్నారు. డ్రైవర్ భాషను అదుపులోకి తీసుకుని విచారించగా... పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మురళి అనే వ్యక్తి కాకినాడకు కిరాయి మాట్లాడినట్లు తెలిపాడు. మార్గమధ్యలోకి వచ్చిన తర్వాత లారీలో సరకుని మాచవరంలో దింపాలని చెప్పినట్లు డ్రైవర్ వెల్లడించాడు. డ్రైవర్​తో పాటు, బియ్యం తరలింపులో భాగస్వాములు నాని, ప్రసాద్​లపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details