ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తూర్పుగోదావరి జిల్లాలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత - illeagle ration rice

తూర్పుగోదావరి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని గ్రామస్థులు అడ్డుకుని పట్టుకున్నారు. బియ్యాన్ని తరలిస్తున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Illegal ration of rice in East Godavari district
తూర్పుగోదావరి జిల్లాలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

By

Published : Mar 31, 2020, 3:35 PM IST

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం వెదిరేశ్వరంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని గ్రామస్థులు పట్టుకున్నారు. రేషన్ దుకాణం నుంచి ద్విచక్రవాహనంపై అక్రమంగా తరలిస్తుండగా పలువురు చూసి రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. తహసీల్దార్, ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకుని ద్విచక్ర వాహనం, నాలుగు బస్తాల బియ్యాన్ని సీజ్ చేసుకున్నారు. బియ్యం తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details