ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొత్తపేటలో 2.50 లక్షల విలువైన గుట్కాల పట్టివేత - GUTKA PACKETS SEEZIED IN KOTHAPETA EAST GODVARI

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో 2.50 లక్షలు విలువైన 35 వేల 989 గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా వీటిని విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. గుట్కాను తరలించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ మాధవ రెడ్డి హెచ్చరించారు.

కొత్తపేటలో 2.50 లక్షలు విలువ చేసే గుట్కా పట్టివేత
కొత్తపేటలో 2.50 లక్షలు విలువ చేసే గుట్కా పట్టివేత

By

Published : Mar 2, 2021, 9:33 PM IST

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో అక్రమంగా గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ మాధవ రెడ్డి తెలిపారు. కొత్తపేటకి చెందిన గ్రంధి నాగ వెంకట సూర్యనారాయణ మూర్తి, కోటిపల్లి దుర్గాప్రసాద్ వీటిని విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుల నుంచి 35 వేల 989 గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ 2.50 లక్షలు ఉంటుందన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details