వివాహేతర సంబంధం కారణంగా ఓ వ్యక్తి ప్రాణం కోల్పోయాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం కూడూరు గ్రామంలో జరిగింది. కత్తుల సోమిరెడ్డి (35) భార్యతో... వారి బంధువు కత్తుల సూర్యనారాయణ రెడ్డి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సోమిరెడ్డి... సూర్యనారాయణ రెడ్డిని పలుమార్లు హెచ్చరించాడు. బుధవారం వీరిద్దరి మధ్య జరిగిన ఘర్షణలో సోమిరెడ్డిని కత్తితో హతమార్చినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
వివాహేతర సంబంధం ప్రాణం తీసింది - east godavari district latest murder case
మారేడుమిల్లి మండలంలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. మృతుడు కత్తుల సోమిరెడ్డిగా పోలీసులు గుర్తించారు. వివాహేతర సంబంధం కారణంగా సోమిరెడ్డిని అతని బంధువు సూర్యనారాయణరెడ్డి హత్య చేసినట్లు స్థానిక ఎస్సై తెలిపారు.
హత్య చేయబడ్డ కత్తుల సోమిరెడ్డి