ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పారిశ్రామికస్థలంలో ఆక్రమణల తొలగింపు.. అధికారులతో స్థానికుల వాగ్వాదం - రంపచోడవరంలో అధికారులు, స్థానికుల మధ్య వాగ్వాదం

పారిశ్రామిక స్థలంలో ఆక్రమణల తొలగింపునకు అధికారులు నడుం బిగించారు. తహసీల్దార్ లక్ష్మీకళ్యాణి, ఎస్సై దుర్గాప్రసాద్ కలిసి.. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో జేసీబీలతో ఆక్రమణలు ఖాళీ చేయించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది.

illegal constructions demolish in rampachodavaram, dispute between officers and locals in rampachodavaram
రంపచోడవరంలో పారిశ్రామిక స్థలంలో ఆక్రమణల తొలగింపు, రంపచోడవరంలో అధికారులు, స్థానికుల మధ్య వాగ్వాదం

By

Published : Apr 17, 2021, 6:28 PM IST

ఆక్రమణలు తొలగిస్తున్న అధికారులు

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలోని పారిశ్రామిక స్థలంలో ఆక్రమణలను రెవెన్యూ, పోలీసులు తొలగించారు. జేసీబీతో ఆక్రమణలు తీసివేస్తుండగా స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంపై అధికారులకు, స్థానికులకు మధ్య కొద్దిసేపు వాగ్వివాదం జరిగింది. ఇండస్ట్రియల్ స్థలంలో దుకాణాలు నిర్మించడం చట్టవిరుద్ధమని చెప్పి చివరకు వారితో ఖాళీ చేయించారు.

ఇదీ చదవండి:అక్రమంగా తరలిస్తున్న 6 కిలోల బంగారం పట్టివేత

స్థానిక పారిశ్రామిక స్థలంలో కొత్తగా మార్కెట్ యార్డ్ మంజూరైంది. దాని నిర్మాణ పనులూ మొదలయ్యాయి. అయితే ఆ స్థలంలో కొందరు వ్యాపారులు అక్రమంగా దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. వీటి తొలగింపునకు ఐటీడీఏ పీవో ప్రవీణ్ ఆదిత్య అధికారులను ఆదేశించారు. దీంతో తహసీల్దార్ లక్ష్మీకళ్యాణి, ఎస్సై దుర్గాప్రసాద్ రంగంలోకి దిగి ఆక్రమణలను ఖాళీ చేయించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

బోరులోంచి బయటకొచ్చిన ప్లాస్టిక్ వ్యర్థాలు, వలలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details