కొత్తపేటలో 37 మద్యం సీసాలు స్వాధీనం
తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఎక్సైజ్ శాఖ సిబ్బంది అరెస్ట్ చేశారు. నిందితులు ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామానికి చెందిన బోణం కుమారి, రావులపాలెం మండలం ఊబలంకకు చెందిన శ్రీనివాసనారాయణరావు, కాట్రేనిపల్లి చంటిలుగా గుర్తించామని కొత్తపేట సర్కిల్ ఎక్సైజ్ శాఖ సీఐ ఏవీ. చలం తెలిపారు. వారి వద్ద నుంచి 37 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో అక్రమ మద్యం పట్టివేత