ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మీకు కాపు కాశా.. మీరంతా నాకు కాపు కాయాలి: చంద్రబాబు

మోదీ, కేసీఆర్​తో జగన్ జతకట్టారని చంద్రబాబు విమర్శించారు. జగన్ తమ మిత్రుడని  భాజపా నేతలంటుంటే... భాజపాకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానంటున్న కేసీఆర్​తో ఎలా కలుస్తారని ప్రశ్నించారు.

చంద్రబాబు ఎన్నికల ప్రచారం

By

Published : Apr 7, 2019, 9:09 PM IST

చంద్రబాబు ఎన్నికల ప్రచారం

ఏపీ అభివృద్ధికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగడుగునా ఆటంకం కలిగిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. కాపుల చిరకాల వాంఛ తెదేపా ద్వారానే సాధ్యమైందన్నారు. కాపుల పక్షాన నిలబడి 5 శాతం రిజర్వేషన్లు కల్పించామన్నారు. ఈ ఎన్నికల్లో కాపులు తెదేపాకు అండగా నిలబడి అఖండ విజయాని అందించాలన్నారు. మోదీ, కేసీఆర్​తో జగన్ లాలూచీ పడ్డారని విమర్శించారు. కేసీఆర్ జగన్ కు వెయ్యికోట్లు ఇచ్చి పంపారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలను డబ్బుతో కొనలేరన్నారు. జగన్ తమ మిత్రుడని భాజపా నేతలంటుంటే...భాజపాకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానంటున్న కేసీఆర్​తో ఎలా కలుస్తారని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details