మాయ మాటలు చెప్పి ఆన్లైన్లో డబ్బులు దండుకుంటూ... పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న ఓ ఘరానా మోసగాడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. తూర్పు గోదావరికి చెందిన దూల నాగేశ్వరరావు... శంషాబాద్ విమానాశ్రయంలో బస్సులు, కార్గో, గూడ్స్ లారీలను లీజుకు ఇప్పిస్తానని లారీ వెనుక భాగంలో ఉన్న ఫోన్ నెంబర్లతో యజమానులకు ఫోన్ చేసి నమ్మబలుకుతూ పలువురిని మోసం చేశాడు.
మోసగాడిని అరెస్టు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు - hyderabad cyber crime police
ఆన్లైన్ మోసాలకు పాల్పడుతూ... పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న ఓ ఘరానా మోసగాడిని తెలంగాణలోని హైదరాబాద్‌లో సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే పలు స్టేషన్లలో నిందితుడిపై కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు.
ఇదే తరహాలో అఫ్జల్‌గంజ్‌కు చెందిన గోవింద రాజ్‌తో అగ్రిమెంట్, సెక్యూరిటి పేరుతో రూ. 92వేలు ఖాతాలో జమ చేయించుకున్నాడు. అనంతరం మీ లీజుకు అనుమతులు వచ్చాయని... వాహనాలు తీసుకొని ఎయిర్‌పోర్టుకు రమ్మని గోవింద రాజ్‌కు చెప్పాడు. అక్కడి వెళ్లి ఎన్నిసార్లు కాల్ చేసినా... స్విచ్ఛాఫ్ వచ్చింది. మోసపోయినని గ్రహించి... సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాగేశ్వరరావుపై సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్‌తో పాటు సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో అనేక కేసులు ఉన్నాయని, విచారణ సమయంలో మూత్రం వస్తుందని చెప్పి.. నానా హంగామా చేసి తప్పించుకుంటాడని పోలీసులు తెలిపారు.