ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

MURDER:వివాహేతర సంబంధంతో విషాదం.. భార్యను చంపిన భర్త - Husband killed his wife in Mummidivaram

అన్యోన్యంగా కలిసి ఉన్న ఆ దంపతుల మధ్య వివాహేతర సంబంధం పెను విషాదాన్ని నింపింది. భర్త మరో స్త్రీతో సహజీవనం చేస్తున్నాడని తెలిసి నిలదీసింది భార్య. అయినా అతని ధోరణిలో మార్పు రాలేదు. తరచూ ఆ విషయంపై వాదోపవాదనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో సహనాన్ని కొల్పోయిన భర్త.. భార్యను అంతమొందించాడు.

husband killed his wife
భార్యను చంపిన భర్త

By

Published : Aug 3, 2021, 12:38 PM IST

Updated : Aug 3, 2021, 7:51 PM IST

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం నక్కవారిపేటలో చెందిన కాశీ రవీంద్రకి దుర్గా మల్లేశ్వరి అనే మహిళతో వివాహం జరిగింది. కొంత కాలంగా భర్త వేరొక మహిళతో సహజీవనం చేస్తున్నాడని తెలిసి నిలదీసింది. అయినా అతనిలో మార్పు రాకపోవటంతో తరచూ.. ఇరువురి మధ్య వివాదాలు జరుగుతూనే ఉండేవి. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన భర్త.. నిన్న రాత్రి భార్యను తీవ్రంగా గాయపరిచి పక్కనున్న కాలువలోకి నెట్టివేయడంతో ఆమె మృతి చెందింది.

ఉదయం రవీందర్ పోలీస్ స్టేషన్​కు వెళ్లి జరిగిందంతా చెప్పి లొంగిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ముమ్మిడివరం ఎస్సై మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించాడు. అమలాపురం డీఎస్పీ పర్యవేక్షణలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఇదీ చదవండీ..CBAS EXAM: సీబీఏఎస్‌ పరీక్ష రద్దు!

Last Updated : Aug 3, 2021, 7:51 PM IST

ABOUT THE AUTHOR

...view details