ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆలయంలో దొంగతనం .. సీసీ కెమెరాల్లో ఘటన నిక్షిప్తం

తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం మండలం లంకల గన్నవరంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగింది. హుండీని ఓ దొంగ ఎత్తుకెళ్లాడు. ఈ దృశ్యాలు సీసీ ఫుటేజీలో నిక్షిప్తమయ్యాయి. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

By

Published : Mar 29, 2021, 3:53 PM IST

hundi  theft at venkateswaraswamy temple  lankala gannavaram
ఆలయంలో దొంగతనం చేస్తున్న దృశ్యాలు

ఆలయంలో దొంగతనం చేస్తున్న దృశ్యాలు

తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం మండలం లంకల గన్నవరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగింది. ఎస్సై జి .సురేంద్ర సంఘటనా ప్రదేశానికి చేరుకుని సీసీ ఫుటేజ్ ద్వారా వివరాలను సేకరించారు. ఆలయం ముందు ఉన్న హుండీని ఒక దొంగ బయటకు తీసుకెళ్లాడు. ఈ దృశ్యాలు సీసీ ఫుటేజీలో నిక్షిప్తమయ్యాయి.

ఆలయానికి వెనక వైపున ఉన్న కొబ్బరితోటలో ధ్వంసమైన హుండీని స్థానికులు గుర్తించి.. పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు హుండీని ఆలయంలో ఉంచి పరిశీలించారు. అందులో సొమ్ము ఎంతపోయిందన్నదీ తెలియలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details