తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలో ఈ నెల 1 నుంచి 6 వరకు వందల మందికి నిర్వహించిన కరోనా పరీక్షల్లో అందరికి నెగిటివ్ రావడంతో... అంతా ఊపిరి పీల్చుకున్నారు. పట్టణంలో ముగ్గురికి పాజిటివ్ ఉన్నట్లు ఈ నెల 1 న నిర్ధరించారు. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తమయ్యారు. పాజిటివ్ వచ్చిన ముగ్గురు... ఎవరెవరిని కలిశారన్నదానిపై ఆరా తీశారు. బంధువులు, అనుమానితులు ఇలా వందల మందికి పరీక్షలు నిర్వహించారు. వీరందరికి నెగిటివ్ రావడంతో తుని ప్రజలు ఊరట చెందారు. మరోవైపు పట్టణంలోని రెడ్జోన్లలో అధికారులు.. లాక్డౌన్ని పక్కాగా అమలు చేస్తున్నారు.
హమ్మయ్య... అక్కడ అందరికీ నెగిటివ్ - తూర్పుగోదావరిలో కరోనా వార్తలు
తుని పట్టణంలో ముగ్గురికి పాజిటివ్ కేసులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బాధితులు ఎవరెవర్ని కలిశారన్న దానిపై ఆరా తీసి... వారందరికీ పరీక్షలు నిర్వహించారు. వందలాది మందికి చేసిన ఈ పరీక్షలు నెగిటివ్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
hunderds of people tested corona negative at thuni in east godavari