కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలంలోని ర్యాలీ గ్రామంలో నిబంధనలు గాలికొదిలేసి వ్యాక్సినేషన్ పక్రియ నిర్వహిస్తున్నారు. ర్యాలీ గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో టీకా ప్రక్రియ ప్రారంభించారు. రద్దీని తగ్గించడానికి అధికారులు టోకెన్ సిస్టం తీసుకొచ్చారు. కానీ అది అమలవుతుందా? అనే అనుమానం కలుగుతోంది. ప్రజలు గుంపులుగా చేరి వ్యాక్సిన్ కోసం తోసుకుంటున్నారు.
వ్యాక్సిన్ కోసమా.. వైరస్ను అంటించుకునేందుకా..?
తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీలోని కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రం వద్ద పరిస్థితిని చూస్తే... కరోనా రక్షణ కోసం వ్యాక్సిన్ వేయించుకునేందుకు వచ్చారా? లేక వైరస్ను అంటించుకునేందుకు వచ్చారా? అన్నట్లు తయారయింది.
ర్యాలీలోని కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రం వద్ద పరిస్థితి
రద్దీ ఇంత ఉన్నా... అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కరోనా మహమ్మారి వల్ల గ్రామంలో చాలామంది మరణించారు. అయినా అధికారులు చర్యలు తీసుకోవడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టోకెన్ సిస్టంను సక్రమంగా అమలు చేసి... కొవిడ్ నిబంధనలు పాటించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఇదీ చదవండీ... curfew extended: కర్ఫ్యూ వేళల్లో మార్పులు.. ఆ సమయంలో బయటికొస్తే చర్యలు!