తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఈనాడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటో షోకు విశేష స్పందన లభిస్తోంది. నిర్వాహకులు వివిధ కంపెనీల కార్లు, ద్విచక్రవాహనాలను ప్రదర్శనకు ఉంచారు. మార్కెట్లోకి వచ్చిన కొత్త మాడెల్ వాహనాలను సందర్శకులు ఆసక్తిగా తిలకించారు. ఔత్సాహికులు వాహనాల్లో ఎక్కి టెస్ట్ డ్రైవ్ చేశారు. అన్ని రకాల బ్రాండ్లు ఒకే చోట చేర్చడం వల్ల తమకు కావల్సిన వాహనాన్ని ఎంచుకొని కొనేందుకు బాగా ఉపయోగపడుతుందని సందర్శకులు తెలిపారు. ఆదివారం కావడం వల్ల ప్రదర్శన తిలకించేందుకు సందర్శకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
రాజమహేంద్రవరంలో ఈనాడు ఆటో షోకు భారీ స్పందన - eenadu auto show at rajamahendravaram news
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఈనాడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటో షోకు విశేష స్పందన లభిస్తోంది. మార్కెట్లోకి వచ్చిన కొత్త మోడల్ వాహనాలను సందర్శకులు ఆసక్తిగా తిలకించారు.
రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన ఆటో షోకు భారీ స్పందన