కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారికి శనివారం రూ.2,13,334 ఆదాయం వచ్చింది. వివిధ ప్రాంతాలను నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ప్రత్యేక దర్శనం ద్వారా 1838, సాధారణ దర్శనం ద్వారా 1123 భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
ప్రత్యేక దర్శనం ద్వారా రూ.91,900 ఆదాయం, అన్నదాన విరాళానికి రూ.57,373, సేవల రూపంలో రూ.12,050, లడ్డూల రూపంలో రూ.42,795, విరాళల ద్వారా రూ.9,216 మొత్తం రూ.2,13,334 ఆదాయం వచ్చినట్లు కార్యనిర్వాహణాధికారి మదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.