ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పీడీఎస్​ బియ్యం పట్టివేత.. 4 వాహనాలు స్వాధీనం

తూర్పు గోదావరి జిల్లాలో అక్రమంగా రవాణా చేసేందుకు సిద్ధంగా ఉన్న పీడీఎస్​ బియ్యాన్ని జిల్లా ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు పట్టుకున్నారు. నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

seized
రవాణాకు సిద్ధంగా ఉంచిన పీడీఎస్​ బియ్యం పట్టివేత ... నాలుగు వాహనాల స్వాధీనం

By

Published : Dec 20, 2020, 11:19 AM IST

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం దేవరపల్లిలో నిబంధనలకు విరుద్ధంగా.. రవాణా చేసేందుకు సిద్ధంగా ఉంచిన 4.5 టన్నుల పీడీఎస్​ బియ్యాన్ని రాజమహేంద్రవరం విజిలెన్స్ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు సీజ్ చేశారు. దేవరపల్లిలో అక్రమంగా బియ్యాన్ని నిల్వ చేసినట్టు అందిన సమాచారంతో జిల్లా విజిలెన్స్ ఎస్పీ ఉప్పాడ రవి ఆదేశాల మేరకు సి.ఐ వి.సత్యకిషోర్ ఆధ్వర్యంలో అధికారుల బృందం దాడులు నిర్వహించాయి.

కర్రి రామిరెడ్డి అనే వ్యక్తి పీడీఎస్​ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి రవాణా చేసేందుకు సిద్ధంగా ఉంచారని తమకు సమాచారం అందిన మేరకు దాడి చేసి సీజ్ చేసినట్లు సీఐ సత్య కిషోర్ తెలిపారు. రామిరెడ్డితో పాటు ముగ్గురు ఆటో డ్రైవర్లపై రావులపాలెం పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. నాలుగు వాహనాలు సీజ్ శామని.. మొత్తంగా నలుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేన్నామని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details