తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలోని చాకలిపాలెం వద్ద కాజ్వేపై వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆరు రోజుల నుంచి వరద తగ్గకపోవడంతో రాకపోకలు సాగించేందుకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాజ్వేను ఎత్తుగా నిర్మించాలని కోరుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని.. ఫలితంగా తమకు ఈ అవస్థ తప్పడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వశిష్ట, వైనతేయ, గోదావరి నది పాయలో ఇప్పటికీ వరద కొనసాగుతూనే ఉంది.
HEAVY FLOOD: కాజ్వే పై వరద.. రాకపోకలకు తీవ్ర అంతరాయం - floods in east godavari district
గోదావరి నదికి వరద ప్రవాహం తగ్గినప్పటికీ.. ముంపు గ్రామాల వాసులకు కష్టాలు తప్పడం లేదు. తూర్పుగోదావరి జిల్లా చాకలిపాలెం వద్ద కాజ్వే పైనుంచి వరద ప్రవహిస్తుండంతో రాకపోకలు నిలిచిపోయాయి.
కాజ్వే పై నుంచి వరదకాజ్వే పై నుంచి వరద