ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏలేశ్వరంలో.. ఇంటింటికీ రేషన్ నిలిపేసిన వాహనదారులు

కరోనా రెండో దశ విజృంభిస్తున్న పరిస్థితుల్లో.. తమకు రక్షణ లేకుండా పోయిందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేశారు. 2 నెలలుగా జీతాలు ఇవ్వటం లేదని ఆవేదన చెందారు. తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం మండల పరిధిలో.. ఇంటింటికి రేషన్ పంపిణీని వాహనదారులు నిలిపేశారు.

House to house ration suspension in Eleshwaram
House to house ration suspension in Eleshwaram

By

Published : May 1, 2021, 2:46 PM IST

రెండు నెలలుగా జీతాలు పడటం లేదని, కరోనా విలయ తాండవం చేస్తున్న సమయంలో అయినా తమకు సరైన రక్షణ లేదని ఏలేశ్వరం పరిధిలోని.. ఇంటింటికీ రేషన్ పంపిణీ వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తమకు అదనపు రేషన్ ఇవ్వాలని, జీతం సైతం సరిపోవడం లేదంటూ హెల్పర్లు డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ కారణాలతో.. ఏలేశ్వరం మండల పరిధిలో వాహనాలను నిలిపేస్తున్నట్టు తెలిపారు. ఫలితంగా.. రేషన్ పంపిణీ తాత్కాలికంగా నిలిచిపోయింది.

ABOUT THE AUTHOR

...view details