ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'బలవంతంగా పట్టాలిచ్చారు.. అవి మాకొద్దు'

తూర్పు గోదావరి జిల్లా ఉప్పలపాడులో ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేసింది. కాలువ సమీపంలో ఉన్న ఆ స్థలాలు వద్దంటూ మహిళలు ఆందోళన చేపట్టారు. నివాసయోగ్యమైన ప్రాంతంలో ఇవ్వాలని డిమాండ్ చేశారు.

house patta victims
'బలవంతంగా పట్టాలిచ్చారు.. అవి మాకొద్దు'

By

Published : Jan 23, 2021, 8:13 PM IST

తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మండలం ఉప్పలపాడులో ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల స్థలాలు వద్దంటూ మహిళలు ఆందోళన నిర్వహించారు. పోలవరం కాలువ దగ్గరలో కేటాయించిన స్థలాలు వద్దని 6 నెలలుగా చెబుతున్నా.. బలవంతంగా ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మరో ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారికి జనసేన నాయకులు పాఠంశెట్టి సూర్యచంద్ర మద్దతు ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details