తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం టేకి గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు మద్దిరాల ధనరాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత ఆరు నెలలుగా ఇసుక కొరతతో పనుల్లేక.. అప్పులపాలై ఉరేసుకుని చనిపోయాడని బంధువులు తెలిపారు. మృతునికి ఏడేళ్ల బాలుడు ఉన్నాడు. నెల రోజుల క్రితమే ధనరాజు భార్య వెంకటలక్ష్మికి ఆడపిల్ల పుట్టింది. ఇంతలో ఈ విషాదం అయినందున అతని భార్యా పిల్లలు రోడ్డున పడ్డారని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే వారిని ఆదుకోవాలని కోరారు.
ఇసుక కొరతతో మరో భవన నిర్మాణ కార్మికుడు ఆత్మహత్య - house building employee suicide in east godavari district
ఇసుక కొరత మరో భవన నిర్మాణ కార్మికుణ్ని బలి తీసుకుంది. తూర్పుగోదావరి జిల్లా టేకి గ్రామానికి చెందిన మద్దిరాల ధనరాజు అనే భవన నిర్మాణ కార్మికుడు పనుల్లేక ఆత్మహత్య చేసుకున్నాడు.
![ఇసుక కొరతతో మరో భవన నిర్మాణ కార్మికుడు ఆత్మహత్య](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5020845-574-5020845-1573387942553.jpg)
ఇసుక కొరత: అప్పుల పాలై... ఆత్మహత్య చేసుకుని
ఇసుక కొరతతో ఉపాధి లేక... నిర్మాణ కార్మికుడు ఆత్మహత్య
ఇదీ చదవండి:
Last Updated : Nov 13, 2019, 3:47 PM IST