తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలోని మండల పరిషత్ కార్యాలయంలో నూతనంగా రూ.14 లక్షలతో నిర్మించిన ఉద్యాన వనరుల కేంద్రాన్ని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినెపి విశ్వరూప్ ప్రారంభించారు. కార్యాలయంలోని గదులను అమలాపురం ఎంపీ చింతా అనురాధ, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డిలు ప్రారంభించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని మంత్రి విశ్వరూప్ అన్నారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో మొక్కలను నాటారు.
కొత్తపేటలో ఉద్యాన వనరుల కేంద్రం ప్రారంభం - మంత్రి పినిపే విశ్వరూప్
పేదల సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర మంత్రి పినెపి విశ్వరూప్ అన్నారు. కొత్తపేటలో నూతనంగా నిర్మించిన ఉద్యాన వనరుల కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
కొత్తపేటలో ఉద్యాన వనరుల కేంద్రం ప్రారంభం