తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలోని అతిథి గృహంలో.. నూతన వధూవరుల శోభనానికి జరిగన ఏర్పాట్ల ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాధారణంగా విశ్వవిద్యాలయంలోని అతిథి గృహాన్ని.. యూనివర్సిటీకి చెందిన వారికి మాత్రమే కేటాయిస్తారు.
కానీ.. ఉమెన్ ఎంపవర్మెంట్ డైరెక్టర్ స్వర్ణకుమారి పేరిట ఈ నెల 18 నుంచి మూడు రోజులపాటు అతిథిగృహాన్ని అద్దెకు తీసుకున్నారు. ఈ క్రమంలోనే.. వివాహ వేడుక అనంతరం ఒక గదిలో శోభన ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఇలాంటి వాటిని అనుమతించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై వర్సిటీ అధికారులు విచారణ చేపట్టారు. ఐదుగురితో కమిటీని ఏర్పాటు చేశారు.