గోదావరి పడవ బోల్తాపై హోంమంత్రి సుచరిత స్పందించారు. ఇప్పటికే రెండు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలకు పంపించామని తెలిపారు. అదనంగా ఇంకో ఎన్డీఆర్ఎఫ్, ఐదు అగ్ని మాపక బృందాలు చేరుకున్నాయన్నారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే అధికారులను అప్రమత్తం చేసి సహాయక చర్యలకు ఆదేశించామన్నారు. చీకటిలో వెతుకులాటకు నావికా దళం నుంచి గజ ఈతగాళ్లను రప్పించామని... గాలింపు చర్యలకు కావాల్సిన అన్ని పరికరాలను అందించామని వెల్లడించారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకంటామని స్పష్టం చేశారు.
పడవ ప్రమాద బాధ్యులపై కఠిన చర్యలు: హోంమంత్రి - homeminister sucharita responds on godavari boat sink
గోదావరిలో పడవ బోల్తాపై హోంమంత్రి సుచరిత మాట్లాడారు. సహాయ చర్యలు ముమ్మరం చేశామన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం :హోంమంత్రి సుచరిత
Last Updated : Sep 16, 2019, 1:33 AM IST
TAGGED:
హోంమంత్రి సుచరిత