ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది..అందుకే నష్టం తగ్గింది: హోంమంత్రి - హోంమంత్రి తానేటి వనిత

HOME MINISTER: గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏ ఒక్కరికీ ఇబ్బంది తలెత్తకుండా ప్రభుత్వ యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుందని హోంమంత్రి తానేటి వనిత తెలిపారు. ప్రభుత్వం ముందస్తు చర్యల కారణంగానే నష్టం తగ్గిందన్నారు. బాధితులందరికీ ప్రభుత్వం తరపున సాయం అందుతోందన్నారు. వరదలపై ప్రతిపక్షాలు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నాయని ఆమె తెలిపారు.

HOME MINISTER
ప్రభుత్వం ముందస్తు చర్యల కారణంగానే నష్టం తగ్గింది: హోంమంత్రి

By

Published : Jul 22, 2022, 4:30 PM IST

ప్రభుత్వం ముందస్తు చర్యల కారణంగానే నష్టం తగ్గింది: హోంమంత్రి

HOME MINISTER:వరద ముంపు ప్రాంతంలో బాధితులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టిందని హోంమంత్రి తానేటి వనిత తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్ అండ్ బీ అతిథి గృహంలో మీడియా సమావేశం నిర్వహించారు. వరద ముంపు ప్రాంతంలో 95 వేల మందికి నిత్యావసర వస్తువులు అందించామని వెల్లడించారు. కోనసీమలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని.. వారికి ప్రభుత్వం నుంచి సాయం అందిందన్నారు. ప్రభుత్వం ముందస్తు చర్యల కారణంగానే నష్టం తగ్గిందన్నారు.

వరదలపై ప్రతిపక్షాలు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నాయని తానేటి వనిత అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హుద్‌హుద్‌ తుఫాన్ వచ్చినప్పుడు నీటి కోసం ప్రజలు కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారని.. ఆ వీడియోలు సోషల్ మీడియాలో ఉన్నాయని ఆమె ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రామ్, వైకాపా నాయకులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details