ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నవతరం హరిదాసు... నయా గెటప్ సూపర్..! - నవతరం హరిదాసు తాజా వార్తలు

సంక్రాంతి అంటే... ముగ్గులు, గొబ్బెమ్మలు, కోళ్ల పందేలు, పిండివంటలు, యువతుల నృత్యాలు ఇందంతా పండగ. ఆ పండగకు ప్రాణం పోసేది మాత్రం హరిదాసే. తను లేకుంటే... పండగ లాగానే ఉండదు. అందుకనే సంప్రదాయాలను మర్చిపోకుండా... ఓ నయా హరిదాసు దర్శనమిస్తున్నాడు.

hitech haridas in east godavari
బైకుపై భిక్షాటన చేస్తున్న హరిదాసు

By

Published : Jan 4, 2020, 11:26 PM IST

నవతరం హరిదాసు... నయా గెటప్ సూపర్..!

సంక్రాంతి పర్వదినాన పూర్వంలో వేకువజామునే హరిదాసు ఊర్లోకి వచ్చి, నెత్తిన అక్షయపాత్ర, ఓ చేతిలో చిడతలు, మరో చేతిలో తంబూర పట్టుకొని భక్తిరస హరి కీర్తనలతో భిక్షాటన చేస్తూ ఉండేవారు. దానం స్వీకరించే సమయంలో హరిదాసు వినమ్రంగా క్రిందకి వంగి నెత్తి అక్షయ పాత్రలో దాన్ని స్వీకరించి ఆశీర్వదిస్తూ ఉంటాడు. కానీ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, రాజానగరం నియోజకవర్గంలో సరికొత్త భిక్షాటనకు శ్రీకారం చుట్టారు హరిదాసులు.

ఇప్పుడంతా హైటెక్ కాలం. వీధీ..వీధీనా నడిచే పనిలేకుండా నెత్తిన అక్షయ పాత్ర మోయకుండా హరి కీర్తన సైతం పాడకుండా కొత్త విధానానికి తెరలేపారు. తలపై ఉండాల్సిన అక్షయపాత్రను బైక్ హెడ్ లైట్ వద్ద అమర్చుకొని... తీరిగ్గా కూర్చొని ఇళ్లిల్లు తిరుగుతూ... నోటికి పని చెప్పకుండా టేప్ రికార్డుకు సౌండ్ బాక్సులు పెట్టేసి హరికీర్తనను ఓ రేంజ్​లో వినిపిస్తున్నారు.

తరతరాలుగా సంప్రదాయాలను కాపాడుకునేందుకు ఈ వృత్తిని కొనసాగిస్తున్నామని హరిదాసులు చెప్తున్నారు. జనాభా, ప్రాంతాలు పెరిగిపోవటం కారణంగా... హరిదాసులు నడవలేక బైక్ ఎక్కి సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని చెబుతున్నారు. హరిలో రంగ హరి అంటూ... చిడతలు వాయిస్తూ హరిదాసు చేసే హడావుడి ఆర్టిఫిషియల్​గా మారిందని కొందరు అంటుంటే... నవతరం హరిదాసు నయా గెటప్ సూపర్ అంటున్నారు మరికొందరు.

ఇదీచూడండి.కళాశాలలో సంక్రాంతి సంబరాలు.. సంప్రదాయ దుస్తుల్లో యువత

ABOUT THE AUTHOR

...view details