కరోనా రోగులకు రోగనిరోధక శక్తి పెంచే విధంగా పోషక విలువలతో కూడిన పౌష్టికాహారం అందించాలని... తూర్పుగోదావరి జిల్లా అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రత్యేకంగా బోడసకుర్రులోని కొవిడ్ కేర్ సెంటర్ నిర్వాహకులకు సూచించారు. సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్.. కోవిడ్ కేర్ సెంటర్లో భోజనం చేసి నాణ్యతా ప్రమాణాల్ని పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న వైద్యులు, అధికారులను అభినందించారు.
'కొవిడ్ కేర్ కేంద్రాల్లో పౌష్టికాహారం అందించండి' - తూర్పుగోదావరి జిల్లా వార్తలు
కొవిడ్ కేర్ కేంద్రాల్లోని వ్యాధిగ్రస్తులకు పోషక విలువలతో కూడిన ఆహారం అందించాలని తూర్పుగోదావరిజిల్లా అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్.. సిబ్బందికి సూచించారు.
కొవిడ్ కేర్ సెంటర్ను పరిశీలించిన సబ్ కలెక్టర్ హిమాన్షు