ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్​కు హైకోర్టులో ఊరట - నాన్ బెయిల్​బుల్​ వారెంట్​

ఓ కోర్టుధిక్కరణ వ్యాజ్యంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డిపై ఈ ఏడాది జూన్ 18న ఇచ్చిన నాన్ బెయిల్​బుల్​ వారెంట్​ను హైకోర్టు ఉపసంహరించుకుంది.

east Godavari collector
హైకోర్టులో ఊరట

By

Published : Jul 10, 2021, 3:37 AM IST

ఓ కోర్టుధిక్కరణ వ్యాజ్యంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డిపై ఈ ఏడాది జూన్ 18న ఇచ్చిన నాన్ బెయిల్​బుల్​ వారెంట్​ను హైకోర్టు ఉపసంహరించుకుంది. శుక్రవారం జరిగిన విచారణకు కలెక్టర్ స్వయంగా హాజరై వారెంట్ వెనక్కి తీసుకోవాలని అభ్యర్థించారు. గత విచారణకు కోర్టుకు ఎందుకు హాజరుకాలేకపోయారో వివరాలు సమర్పించారు. వాటిపై సంతృప్తి చెందిన న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ వారెంట్​ను ఉపసంహరిస్తూ ఉత్తర్వులిచ్చారు. తదుపరి విచారణను ఈ నెల 16 కు వాయిదా వేశారు.

ABOUT THE AUTHOR

...view details