స్థానిక సంస్థల (Local Body elections) ఎన్నికల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా పులిమేరు 24, 25, 26 బూతులలో రీపోలింగ్ (Re-polling) నిర్వహించాలన్న ఎస్ఈసీ (SEC) నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జనసేన అభ్యర్థి హైకోర్టులో వ్యాజ్యం (Pill in High Court) దాఖలు చేశారు. వ్యాజ్యంపై విచారణ చేపట్టిన ధర్మాసనం..ఎస్ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్‌ను సస్పెండ్ (suspend) చేసింది. పులిమేరు ఎంపీటీసీ (MPTC) 25వ బూతులో కొన్ని ఓట్లు చెదలు పట్టడంతో రీ పోలింగ్ నిర్వహించాలని గతంలో ఎస్ఈసీ నిర్ణయం తీసుకుందని పిటిషనర్ తరపు న్యాయవాది ప్రతాప్ వాదనలు వినిపించారు. అయితే.. 25వ బూత్‌తో పాటు 24, 26 బూతులలో ఎన్నికలు నిర్వహించాలని తాజాగా ఎస్ఈసీ రెండో సారి నిర్ణయం తీసుకుందని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. గతంలో కౌంటింగ్ సమయంలో జనసేన అభ్యర్థికి 100 ఓట్ల మెజార్టీ వచ్చిందని న్యాయవాది వాదించారు.
వాదనలు విన్న న్యాయస్థానం.. ముందు 25వ బూతుకు రీపోలింగ్ డిక్లేర్ చేసి ఇప్పుడు 24, 25, 26 బూతులలో కొత్తగా ఎన్నికలు పెట్టడం ఏంటని ఎస్ఈసీని ప్రశ్నించింది. తాజాగా ఎస్ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్‌ను హైకోర్టు సస్పెండ్ చేసింది.