తూర్పుగోదావరి జిల్లాకు చెందిన న్యాయవాది సుభాష్ చంద్రబోస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆయన భార్య పి.వెంకట ప్రియదీప్తి హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి ఒంటిగంటకు ప్రత్తిపాడు, ఏలేశ్వరం పోలీసులు.. తమ ఇంటికి వచ్చి తలుపులు బద్దలుకొట్టి తన భర్తను నిర్బంధించి తీసుకెళ్లారని హెబియస్ కార్పస్ రిట్ వేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టు ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. గత విచారణలో న్యాయవాదిని కోర్టు ముందు హాజరుపర్చాలని ధర్మాసనం తూర్పుగోదావరి జిల్లా ఎస్పీని ఆదేశించింది. అలాగే ఎస్పీని కోర్టుకు హాజరుకావాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది.
న్యాయవాది పోలీసుల అదుపులో లేరు