తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం తెదేపా ఇన్ఛార్జ్ వరుపుల రాజాపై ఎటువంటి చర్యలు చేపట్టరాదని హైకోర్టు... పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసింది. లంపకలోవ సొసైటీలో నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో ప్రత్తిపాడు పోలీసులు రాజాపై కేసులు నమోదు చేశారు. రాజకీయ కక్షలతోనే తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని వరుపుల రాజా హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు.
'తదుపరి ఉత్తర్వు వచ్చేవరకు వరుపుల రాజాపై చర్యలు తీసుకోవద్దు' - high court on varapaula raja petition
తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు తెదేపా నేత వరుపుల రాజాపై తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు.. ఎటువంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఈమేరకు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

హైకోర్టు